Header Banner

పహల్గామ్ ఉగ్రవాదుల వేటలో భారత్‌కు సహకరించండి..! పాకిస్థాన్‌కు అమెరికా సూచన!

  Fri May 02, 2025 13:25        India, U S A

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. అదే సమయంలో, ఇరు దేశాలు సంయమనం పాటించాలని, విస్తృత ప్రాంతీయ ఘర్షణలకు తావివ్వరాదని సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఫాక్స్ న్యూస్‌’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘పాకిస్థాన్ తమ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడి, కట్టడి చేసే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, ఈ విషయంలో భారత్‌కు సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. పహల్గామ్ దాడికి భారత్ స్పందించే తీరు విస్తృత ప్రాంతీయ ఘర్షణలకు దారితీయకుండా ఉండాలని కూడా తాము ఆశిస్తున్నట్టు వాన్స్ పేర్కొన్నారు. ‘ఈ ఉగ్రదాడికి భారత్ స్పందించే విధానం.. మరింత పెద్ద సంఘర్షణకు కారణం కాకూడదనేది మా ఆకాంక్ష’ అని అన్నారు. భారత్‌కు అండగా ఉంటాం అంతకుముందు, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘ప్రధాని మోదీకి మా పూర్తి మద్దతు ఉంది.
మేం ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’ అని ఆమె తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో వేర్వేరుగా మాట్లాడినట్లు బ్రూస్ వివరించారు. గత వారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో చెప్పినట్టుగానే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందని, ప్రధాని మోదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె పునరుద్ఘాటించారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన సంభాషణల్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను పహల్గామ్ దాడిని ఖండించాలని కోరినట్టు తెలిసింది. అదే సమయంలో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌తో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని రూబియో హామీ ఇచ్చారు. పెరిగిన ఉద్రిక్తతలు, చర్యలు పహల్గామ్ దాడిలో సరిహద్దు ఆవలి శక్తుల ప్రమేయం ఉందని భావిస్తున్న భారత్..
పాకిస్థాన్‌పై పలు కఠిన చర్యలు చేపట్టింది. 65 ఏళ్ల సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరులకు వీసాలను రద్దు చేయడం, అట్టారీ సరిహద్దును మూసివేయడం, పాకిస్థాన్ సైనిక దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పాకిస్థాన్ విమానాలకు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఈ చర్యలతో ఒత్తిడికి గురైన పాకిస్థాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నత స్థాయి రక్షణ అధికారులతో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ స్పందన ఎలా ఉండాలి? లక్ష్యాలు, సమయం వంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే పూర్తి కార్యాచరణ స్వేచ్ఛను సాయుధ బలగాలకు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.


ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PahalgamTerrorAttack #IndiaPakistanTensions #Terrorism #USAIndiaRelations #Pakistan #USAdvice